BIGG BOSS 7 TELUGU DAY 6 HIGHLIGHTS । గౌతం ని ఎందుకు ‘ఛీ తూ’ అన్నావు శుభ శ్రీ … ,

Bigg Boss 7 Telugu Day 6 | Bigg Boss 7 Telugu Day 6 highlight |  Bigg boss 7 telugu today episode | Bigg boss 7 telugu Love tracks.

BIGG BOSS 7 TELUGU DAY 6 HIGHLIGHTS జవాన్ సినిమాలోని ‘రామయ్య వస్తావయ్య’ అనే సాంగ్ ద్వారా నాగార్జున ఎంట్రీ మొదలై ప్రేక్షకులతో ఇంట్రాక్ట్ అయ్యాక నిన్న జరిగిన ఎపిసోడ్ మనం చూడలేదు కదా చూద్దామoటాడు.

నీ గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోతే ఏం చేస్తావ్ ప్రశాంత్:

నీ గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోతే నువ్వేం ఏం చేస్తావ్ ప్రశాంత్ అని శుభశ్రీ అడిగింది. ఎవరితో మాట్లాడితే వారు గర్ల్ ఫ్రెండ్ అవుతారా అయితే నీతో మాట్లాడుతున్న కదా నువ్వు కూడా నా గర్ల్ ఫ్రెండ్ అయిపోతావా అని ప్రశాంత్ అడిగితే అవును అయిపోతా అయితే ఏంటి అని శుభ శ్రీ అన్నది.


నీకో ముద్ద నాకో ముద్ద –రతిక :

ఒకవైపు పలికిన హార్ట్ ని అతికే అతికి పెట్టే క్రమంలో ప్రశాంత్ రతిక ఉన్నారు .
రతిక అన్నం కలుపుతూ చేతిలో పెడతాను తిను అని ప్రశాంత్ నీ అడిగితే లేదు ఎవరైనా చేతిలో పెడతారా ఇదేమన్న ప్రసాదమా ? నోట్లో పెట్టమని అడుగుతాడు అవును ఇది ప్రసాదమే కావాలంటే మొక్కి తిను. అయినా కూడా రతిక కావాలని ప్రశాంత్ నోట్లో పెట్టడం లేదు ఇక పెట్టడం లేదు అని ఇలా అయితే జరిగేది లేదని ప్రశాంత్ అక్కడి నుండి వెళ్లిపోతాడు. సోఫా పై లవ్ సింబల్ వేసి అందులో PR అని లెటర్స్ రాసి ముద్దులు పెడుతుంటాడు ప్రశాంత్ మధ్యలో రతిక వస్తే సోఫాకి పెడుతున్నావా అని అడిగితే రతిక కి కూడా ఫ్లైయింగ్ కిస్ ఇస్తాడు.

శుభ శ్రీ నువ్వు యూస్ లెస్ — ప్రిన్స్:

Bigg boss 7 telugu today episode శుభశ్రీని నువ్వు యూజ్లెస్ అని ప్రిన్స్ అంటూ నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు అని అంటాడు అప్పుడు శుభశ్రీ కోపంగా చూసినప్పుడు నువ్వు నా ఫ్రెండ్ అయితే నేను ఏమన్నా అనొచ్చు కానీ నువ్వు ఫీల్ అవుతున్నావ్ నేను నీతో మాట్లాడను అంటూ సారీ చెప్తున్నా అని అంటాడు. శుభశ్రీ, నీ ఆటిట్యూడ్ చూపించకు అంటుంది. నేను సరదాగా అన్నాను సారీ అని శుభ శ్రీ కి చెప్తాడు ఈ విషయంలో కొంత వాదన జరిగాక ఇద్దరు కాంప్రమైజ్ అవుతారు.

మీకు తెలుగు రాదా –నాగార్జున

ఇప్పుడు నాగార్జున బిగ్ బాస్ హౌస్ సభ్యులతో తో ఇంటరాక్ట్ అవ్వడానికి హౌస్ లోకి ఎంట్రీ అవుతాడు. పరోక్షంగా మిస్టర్ యూజ్లెస్ అని నాగార్జున ప్రిన్స్ పైన సీరియస్ అవుతాడు . నువ్వు ఇంకా తెలుగు నేర్చుకోవడం లేదా అని టాపిక్ డైవర్ట్ చేసి అనవసరమైన మాటలు మాట్లాడవద్దు అని వార్నింగ్ ఇస్తాడు. కిరణ్ రాథోడ్ కి అనవసరమైన తెలుగు పదాలు నేర్పించినందుకు తేజకు పనిష్మెంట్ ఇస్తాడు.

BIGG BOSS 7 TELUGU DAY 6  ఫ్యాన్ పల్స్ ఆధారంగా సభ్యుల పల్స్:

సభ్యులు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ప్రేక్షకులు ఏ విధంగా అనుకుంటున్నారో జెన్యూన్ ప్రేక్షకులతో ఏజ్ ప్రకారం ఓటింగ్ తీసుకున్నాము అంటే ఫ్యాన్ పల్స్ ఆధారంగా స్కోర్ ఇస్తున్నాము అని నాగార్జున తెలియజేస్తాడు. ఎంటర్టైన్మెంట్, టాస్క్, హౌస్ పార్టిసిపెంట్, ఫియర్లెస్ ,ఒరిజినాలిటీ ఈ ఐదు కేటగిరిలలో ప్రతి ఒక్క కేటగిరికి 20 మార్క్స్ ఆధారంగా మొత్తం 100 మార్కులకుక స్కోరు ఇస్తున్నాం.

  • మొదటగా ప్రియాంకతో 71 మార్కులు 100కు గాను. అందరూ సాధించడానికి బిగ్ బాస్ వచ్చారు అని సెటైరికల్ గా చెప్తాడు.
  • శివాజీకి 100 మార్కులకు 74 వచ్చాయని బిగ్ బాస్ ని ఇంప్రెస్ చేయడంలో మీరు చాలా యాక్టివ్ గా ఉండాలని అభినందిస్తాడు కానీ బీస్ట్ టాస్క్ లో తొందరగా గివ్ అప్ ఇచ్చారు, మీ గేమ్ సభ్యులకు అర్థం కావట్లేదు అందుకే మిమ్మల్ని పవర్ అస్త్ర పోటీలో నామినేట్ చేశారు.
  • దామిని కి 100 మార్కులకు గాను 62 ఇచ్చారు
  • ప్రిన్స్ కి వంద మార్కులకు గాని 69 ఇచ్చారు నువ్వు బిగ్ బాస్ ని ఇంప్రెస్ చేయమంటే చేయలేకపోయావు అని అంటారు.
  • షకీలా కి 100 మార్కులు లకు 69 మార్కులు వచ్చాయి
  • సందీప్ కి 100 మార్కులకు 72 వచ్చాయి అని మీరు ఇంటి సభ్యులతో ఇంకా ఎక్కువ కావాలి అని చెప్తారు.
  • శోభ శెట్టి కి 100 మార్కులకు గాని 74 వచ్చాయి మీరు ఏడిస్తే బాగుండదు టాప్ 5 లోకి వెళ్లలేక పోతారు అని ఇక్కడ డాక్టర్ బాబు ఎవరు మీకు అని అడుగుతాడు ఇక్కడ ఎవరూ లేరు అని అంటుంది. ఇప్పుడు మీకు పనిష్మెంట్ ఇస్తున్నాను హాట్ గర్ల్ వాష్రూమ్స్ క్లీన్ చేయాలి అని నాగార్జున గారు చెప్తారు.
  • తేజ కి 100 మార్కులకు గాను 73 వస్తాయి ఇంటి సభ్యులందరూ తేజాన్ని ఫోటో ప్రిపేర్ చేయొద్దని నాగార్జున గారికి చెప్తారు అప్పుడు నాగార్జున ఫుడ్ రివ్యూ ఇచ్చేవారికి కుకింగ్ చేయడం రాదు అని చెప్తారు
  • రతిక కు 100 మార్కుల‌కు 80 మార్కులు వస్తాయి రతిక ను నాగార్జున చాలా గొప్పది తనతో చాలా జాగ్రత్తగా గేమ్ ఆడండి రతిక చాలా చాలా తెలివిగల అమ్మాయి అని చెప్తాడు. నీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా బాగుంటది .ఈ పోల్స్ లో అత్యధిక మార్కులు రతిక కు వచ్చాయి .
  • గౌతమ్ కి 100 మార్కులకు గాను 60 మార్కులు వస్తాయి అసలు హౌస్ లో ఉన్నావా లేదా ఒకరి వెంటనే ఉన్నావా హ్యాండ్ కప్స్ వేసినందుకు ఫాలో అవుతున్నావా అని సెటరికల్ గా గౌతమ్ ని అంటాడు అందరితో సమానంగా ఉండు నువ్వేం చేసావని అంగడిచుకున్నావు 100% ఇచ్చాను అనుకుంటున్నావు అంతే.
  • కిరణ్ రాథోడ్ కి 100 మార్కులకు గాని 50 మార్కులు వస్తాయి తెలుగు సరిగా నేర్చుకోవడం లేదని రోజున 8 మార్కులు కట్ చేస్తారు
  • ప్రశాంత్ కి 100 గాను 74 మార్కులు వస్తాయి చాలా బాగా ఆడవు అని నాగార్జున అంటే నేను గెలవడం కన్నా మావోలు గెలవడం ముఖ్యం అని సంబంధం లేని డైలాగ్ చెప్తాడు నాగార్జున అందుకు రోజులో సగం కెమెరా ముందు మాట్లాడుతున్నావ్ ఇంటి సభ్యులతో కూడా మాట్లాడు అలాగే నేను ఇచ్చిన గిఫ్ట్ ను చూసుకుంటున్నావా లేదా లేడీ లక్ వెంటపడుతున్నావా మొక్కను చూసుకోలేవు కానీ రోజ్ ని ఎలా చూసుకుంటావు అని సెటైరికల్ గా చెప్తాడు.
  • శుభశ్రీ 100 మార్కులు గాని 63 వస్తాయి కానీ నాకు ఒక విషయం చెప్తే నీకు 10 మార్కులు కలుపుతాను అని నాగార్జున చెబుతాడు గౌతమ్ మైక్ తీసేసి నీ దగ్గరగా వచ్చి ఏం చెప్పాడు నువ్వు ” ఛీ తూ ” అని ఎందుకన్నావ్ అని అంటే శుభశ్రీ చెప్పడానికి ధైర్యం చేయదు కానీ నాగార్జున ఇదే క్వశ్చన్ గౌతమ్ ని అడిగితే గౌతమ్ మనం ఎక్కువ కనెక్ట్ అవుదాం అని అన్నాను అని చెప్తాడు.
  • అమర్దీప్ కి 100 మార్కులకు గాను 61 వస్తాయి న్యూస్ సరిగా వాడడం లేదు ఫైర్ మనలో ఉండాలి కారణాలు పెట్టకూడదు నువ్వు సీరియల్ హీరో కాదు గేమ్లో కూడా హీరో గా నిరూపించుకోవాలి అని చాలెంజ్ చేస్తాడు

బిగ్ బాస్ మొదటి ఇంటి సభ్యుడు :

పవర్ ఆస్ట్రా కి పోటీలో ఉన్న సందీప్ ,ప్రియాంక కి బాల్స్, బాస్కెట్ గేమ్ ఇస్తారు
ఇందులో ఎవరు ఎక్కువ బాల్స్ బాస్కెట్ లో వేస్తారా వాళ్లు విజేత సందీప్ అత్యధికంగా బాస్కెట్ లో బాల్స్ వేసినందుకు విజేతగా ప్రకటించబడతాడు బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ హౌస్ మేటుగా కన్ఫర్మ్ చేయబడతాడు

.

READ MORE :

 

Your Page Title

show your love

1 thought on “BIGG BOSS 7 TELUGU DAY 6 HIGHLIGHTS । గౌతం ని ఎందుకు ‘ఛీ తూ’ అన్నావు శుభ శ్రీ … ,”

  1. Pingback: Bigg Boss Telugu 7 Second Week Nominations । నేను బిగ్ బాస్ మాట తప్ప ఎవ్వడి మాటా వినను-పీకుతున్నావ్ అనొద్దు . | BIGG BOSS 7 TELUGU VOTING

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top